రాంచీలో 'నరేంద్ర మోడీ టీ స్టాల్' | Tea stall opened named after Narendra Modi | Sakshi
Sakshi News home page

రాంచీలో 'నరేంద్ర మోడీ టీ స్టాల్'

Oct 9 2013 2:54 PM | Updated on Aug 15 2018 2:14 PM

రాంచీలో 'నరేంద్ర మోడీ టీ స్టాల్' - Sakshi

రాంచీలో 'నరేంద్ర మోడీ టీ స్టాల్'

టీ బాయ్గా జీవితాన్ని ఆరంభించి బీజేపీ ప్రధాని అభ్యర్థి స్థాయికి ఎదిగారు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ.

టీ బాయ్గా జీవితాన్ని ఆరంభించి బీజేపీ ప్రధాని అభ్యర్థి స్థాయికి ఎదిగారు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని జార్ఖండ్ రాజధాని రాంచీలో ఓ వ్యక్తి  'నమో నమో టీ స్టాల్'ను ఆరంభించారు. మోడీపై గౌరవభావంతోనే ఆయన పేరును పెట్టినట్టు నిర్వాహకుడు వినయ్ శర్మ చెప్పారు.

ఈ టీ కొట్టులో ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ ఫొటోలు దర్శనమిస్తాయి. జార్ఖండ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, రాంచీ ఎమ్మెల్యే సి.పి.సింగ్ దీన్ని ఆరంభించారు. పేదరికం నుంచి వచ్చి అత్యున్నత స్థాయికి ఎదిగిన మోడీ స్ఫూర్తిదాయకమని సింగ్ ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement