బీజేపీ, శివసేనల మధ్య తొలగిన విభేదాలు! | Shiv Sena and BJP sorted Differences over portfolio | Sakshi
Sakshi News home page

బీజేపీ, శివసేనల మధ్య తొలగిన విభేదాలు!

May 28 2014 11:07 AM | Updated on Aug 15 2018 2:20 PM

బీజేపీ, శివసేనల మధ్య తొలగిన విభేదాలు! - Sakshi

బీజేపీ, శివసేనల మధ్య తొలగిన విభేదాలు!

మంత్రి పదవుల కేటాయింపుల వ్యవహారంలో బీజేపీ, శివసేనల మధ్య చోటుచేసుకున్న విభేదాలు పరిష్కారమయ్యాయి.

న్యూఢిల్లీ: మంత్రి పదవుల కేటాయింపుల వ్యవహారంలో బీజేపీ, శివసేనల మధ్య చోటుచేసుకున్న విభేదాలు పరిష్కారమయ్యాయి. ప్రధాని నర్మేంద్ర మోడీతో శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయి. దాంతో శివసేన కు కేటాయించిన భారీ పరిశ్రమల శాఖను చేపట్టేందుకు అనంత్ గీతే అంగీకరించారు. బుధవారం ఉదయం 11 గంటలకు గీతే మంత్రి పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. 
 
మంత్రి పదవుల కేటాయింపుపై ప్రస్తుతం ఎలాంటి అసంతృప్తి లేదు. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో కీలక పదవులు దక్కేలా పార్టీ దృష్టిపెట్టింది అని గీతే మీడియాతో అన్నారు. కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గీతే.. తనకు కేటాయించిన భారీ పరిశ్రమల శాఖను చేపట్టేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఇరుపార్టీల మధ్య విబేధాలు నెలకొన్నాయి. అయితే మోడీ, ఉద్దవ్ లు ఓ అవగాహనకు రావడంతో తాత్కాలికంగా విభేదాలను పక్కన పెట్టారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement