'నీ భార్యను అమ్మి.. మరుగుదొడ్డి కట్టు..' | Sell your wife if you don't have money to build toilet, a Bihar DM tells villagers | Sakshi
Sakshi News home page

'నీ భార్యను అమ్మి.. మరుగుదొడ్డి కట్టు..'

Jul 24 2017 8:00 AM | Updated on Sep 5 2017 4:47 PM

'నీ భార్యను అమ్మి.. మరుగుదొడ్డి కట్టు..'

'నీ భార్యను అమ్మి.. మరుగుదొడ్డి కట్టు..'

స్వచ్ఛభారత్‌ ప్రచార కార్యక్రమంలో భాగంగా బీహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లా మేజిస్ట్రేట్‌(డీఎమ్‌) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

పాట్నా: స్వచ్ఛభారత్‌ ప్రచార కార్యక్రమంలో భాగంగా బీహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లా మేజిస్ట్రేట్‌(డీఎమ్‌) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన డీఎమ్‌ కన్వాల్‌ తనూజ్‌ గ్రామస్ధులతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని సూచించారు. మరుగుదొడ్డి లేకపోతే కలిగే నష్టాలను గురించి వారికి వివరించారు. ఇంతలో ఓ గ్రామస్ధుడు లేచి మరుగుదొడ్డి నిర్మించడానికి డబ్బు లేదని చెప్పాడు.

దానికి స్పందించిన కన్వాల్‌.. డబ్బు లేకపోతే నీ భార్యను అమ్ముకోవాలని, ఆ డబ్బుతో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అందరికీ చెబుతున్నా వినండి.. మీ భార్యల గౌరవం కంటే కాపాడుకోవాలంటే మరుగుదొడ్డి తప్పక నిర్మించుకోవాలి. మీ భార్యల విలువ రూ.12 వేలు కన్నా తక్కువని అనుకుంటే మరుగుదొడ్డిని నిర్మించుకోవద్దు లేదా మరుగుదొడ్డి నిర్మించుకోండి'     అని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం ముందుగా డబ్బు మంజూరు చేస్తే వాటిని వేరే అవసరాల కోసం వినియోగించుకుంటున్నారని అన్నారు. దీంతో ఒక్కసారిగా సమావేశ స్ధలంలో గంభీర వాతావరణం ఏర్పడింది. డీఎమ్‌ పద్దతి సరిగా లేదంటూ గ్రామస్ధులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement