విశ్వసనీయతను కాపాడుకోవడమే మీడియా ముందున్న అతిపెద్ద సవాలు అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విమర్శలు ప్రజాస్వామ్యాన్ని ప్రక్షాళన చేస్తాయని అన్నారు.
మీడియాపై మోదీ వ్యాఖ్య
కొల్హాపూర్: విశ్వసనీయతను కాపాడుకోవడమే మీడియా ముందున్న అతిపెద్ద సవాలు అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విమర్శలు ప్రజాస్వామ్యాన్ని ప్రక్షాళన చేస్తాయని అన్నారు. ప్రధాని శనివారమిక్కడ మరాఠీ దినపత్రిక ‘పుధారి’ వజ్రోత్సవాల్లో ప్రసంగించారు. ‘విమర్శ లేకపోతే ప్రజాస్వామ్యం స్తంభిస్తుంది. నీరు ప్రవహిస్తేనే స్వచ్ఛంగా ఉంటుంది, నిలిచిపోతే మురికవుతుంది’ అని అన్నారు.
అయితే విమర్శలు తక్కువ రావడం, ఆరోపణలు మాత్రం వెల్లువెత్తడం ప్రజాస్వామ్యంలో దురదృష్టకరమన్నారు. సమాచారానికి అత్యంత ప్రాధాన్యముందన్నారు. ‘వ్యక్తిగత అధికార దాహం వల్ల ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యం అణచివేతకు గురైంది. దినపత్రికలు మూతపడ్డాయి. ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వారు జైలుపాలయ్యారు. ప్రభుత్వం కోరుకునేదే పత్రికల్లో వచ్చింది. ఇది తెలియగానే ప్రజలు వాటిని చదవడం మానేశారు. ఎన్నో ఏళ్ల ఆత్మవిమర్శ తర్వాత తిరిగి మీడియా విశ్వసనీయత సాధించింది’ అని అన్నారు.