అవినీతిపై పోరాటానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టస్థారుులో వినియోగించుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రజలకు సూచించారు.
ప్రణబ్, మోదీ విజిలెన్స్ వారోత్సవ సందేశం
న్యూఢిల్లీ: అవినీతిపై పోరాటానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టస్థారుులో వినియోగించుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రజలకు సూచించారు. ‘విజిలెన్స్ వారోత్సవం’ ప్రారంభమైన సందర్భంగా రాష్ట్రపతి ఒక సందేశమిస్తూ, అవినీతిపై పోరాటం సాగించడం ప్రజల, ప్రభుత్వ అధికారుల ఉమ్మడి బాధ్యతగా పేర్కొన్నారు.
సంక్లిష్టమైన అవినీతి సవుస్య పరిష్కారానికి బహుముఖ చర్యలు అవసరమని, పారదర్శకతను ప్రోత్సహించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ఆ చర్యల్లో భాగవుని రాష్ట్రపతి పేర్కొన్నారు. అవినీతికి తావులేని సవుర్థవంతమైన పరిపాలనకోసం ప్రభుత్వ అధికారుల్లో నిజారుుతీ, ప్రభుత్వ కార్యాలయూల్లో పారదర్శకత అవసరవుని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయుపడ్డారు. అవినీతిపై పోరాటంలో టెక్నాలజీని వినియోగిస్తున్న తీరు అభినందనీయువున్నారు. అవినీతి నిర్మూలన చట్టబద్ధమైన ఆవశ్యత అని మోదీ అన్నారు.