‘సేద్యంతోనే ఆ కల సాధ్యం’

PM Modi says Agriculture Has A Key Role To Play In Helping The Country - Sakshi

తుంకూర్‌ : రాబోయే రోజుల్లో భారత్‌ ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్ధగా ఎదగాలంటే వ్యవసాయం కీలక పాత్ర పోషించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఎగుమతి ఆధారిత వ్యవస్ధగా సేద్యాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని వెల్లడించారు. కృషి కర్మాన్‌ అవార్డులను బహుకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో సుగంధద్రవ్యాల సాగు, ఎగుమతులను పెంచడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉందని చెప్పుకొచ్చారు.

తమ హయాంలో దేశవ్యాప్తంగా సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి 25 లక్షల టన్నులకు పెరగ్గా, ఎగుమతులు రూ 15,000 కోట్ల నుంచి రూ 19,000 కోట్లకు ఎగిశాయని చెప్పారు. రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి మెరుగైన భవిష్యత్‌ కోసం కేంద్ర ప్రభుత్వం పాటుపడుతోందని తెలిపారు. రైతులు తమ పంటను దాచుకునేందుకు కోల్డ్‌ స్టోరేజ్‌ సదుపాయాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకువస్తోందని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top