నోట్ బందీ సరే.. నస్ బందీ తెండి: గిరిరాజ్ | Minister Giriraj Singh comments | Sakshi
Sakshi News home page

నోట్ బందీ సరే.. నస్ బందీ తెండి: గిరిరాజ్

Dec 6 2016 1:05 AM | Updated on Sep 4 2017 9:59 PM

దేశంలో నోట్‌బందీ (పెద్ద నోట్ల ఉపసంహరణ)జరుగుతోందనీ..ప్రభుత్వం నస్‌బందీ (జనాభా నియంత్రణ) కోసం కూడా చట్టాలు

పట్నా: దేశంలో నోట్‌బందీ (పెద్ద నోట్ల ఉపసంహరణ)జరుగుతోందనీ..ప్రభుత్వం నస్‌బందీ (జనాభా నియంత్రణ) కోసం కూడా చట్టాలు తీసుకురావాలని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి గిరిరాజ్ సింగ్ సలహా ఇచ్చారు. వేగంగా అభివృద్ధి సాధించటానికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను తప్పనిసరి చేస్తూ చట్టం తేవాలని ఆయన ఆదివారం అన్నారు.

‘ప్రపంచ జనాభాలో భారత జనాభా 17 శాతం ఉంది. ఆస్ట్రేలియా మొత్తం జనాభా ఎంతో, అంత జనాభా ప్రతి ఏడాది మన దేశంలో పెరుగుతోంది. అధిక జనాభానే మన అభివృద్ధికి అవరోధంగా మారింది. జనాభా నియంత్రణ చట్టాన్ని మన దేశంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది’ అని గిరిరాజ్ అన్నారు. ఇదొక దిక్కుమాలిన ఆలోచన అని బిహార్ సీఎం నితీష్ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement