పదేళ్లపాటు యూపీఏ ప్రభుత్వాన్ని నడిపిన ప్రధాని మన్మోహన్‌సింగ్ వచ్చే లోక్‌సభ ఎన్నికల అనంతరం పదవి నుంచి తప్పుకొని విశ్రాంతి తీసుకోనున్నారా?
న్యూఢిల్లీ: పదేళ్లపాటు యూపీఏ ప్రభుత్వాన్ని నడిపిన ప్రధాని మన్మోహన్‌సింగ్ వచ్చే లోక్‌సభ ఎన్నికల అనంతరం పదవి నుంచి తప్పుకొని విశ్రాంతి తీసుకోనున్నారా? పార్టీ సేవకే పరిమితమవుతానని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి చెప్పారా? ఢిల్లీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ‘‘వచ్చే లోక్‌సభ ఎన్నికల అనంతరం మన్మోహన్ కాస్త విశ్రాంతి తీసుకొని ఆపై పార్టీ కోసం పనిచేయనున్నారు. అలాగే రాహుల్‌గాంధీకి మార్గనిర్దేశం చేయనున్నారు’’ అని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ద ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. రాహుల్‌ను ప్రధాని పీఠం మీద కూర్చోబెట్టేలా కాంగ్రెస్ లాంఛనంగా నిర్ణయం తీసుకోవడంలో మన్మోహన్ నిర్ణయం మార్గం సుగమం చేసిందని తెలిపింది.