చెప్పుల దండతో ఊరంతా..
ఇంటి బయట ఆడుకుంటున్న మైనర్ బాలికపై ఓ కామాందుడు అత్యాచారయత్నం చేశాడు.
ఉత్తరప్రదేశ్: ఇంటి బయట ఆడుకుంటున్న మైనర్ బాలికపై ఓ కామాందుడు అత్యాచారయత్నం చేశాడు. ఇది గమనించిన బాధితురాలి తల్లి, గ్రామస్తులు అతన్ని చెప్పుతో కొట్టి దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితున్ని చెప్పులదండతో ఊరంతా ఊరేగించారు. ఈ సంఘటన హర్దోయ్ జిల్లాలో చోటుచేసుకుంది.
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితునిపై కేసు నమోదుచేసి అరెస్ట్ చేశామని ఎస్పీ విపిన్ కుమార్ మిశ్రా తెలిపారు. నిందితునికి తగిన శిక్ష విధిస్తామని ఆయన అన్నారు.