రేప్ చేశాడంటూ బీజేపీ నేత కుమారుడిపై ఫిర్యాదు! | madhya pradesh BJP leader son booked for rape | Sakshi
Sakshi News home page

రేప్ చేశాడంటూ బీజేపీ నేత కుమారుడిపై ఫిర్యాదు!

Oct 6 2016 5:12 PM | Updated on Mar 29 2019 9:11 PM

రేప్ చేశాడంటూ బీజేపీ నేత కుమారుడిపై ఫిర్యాదు! - Sakshi

రేప్ చేశాడంటూ బీజేపీ నేత కుమారుడిపై ఫిర్యాదు!

తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ బీజేపీ నేత కుమారుడిపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది.

భోపాల్: తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ బీజేపీ నేత కుమారుడిపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని కొత్వాలి పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్టేషన్ ఇన్ స్పెక్టర్ ఆర్.పి.చౌదరి తెలిపిన వివరాల ప్రకారం.. లిధోరా మండల బీజేపీ ఉపాధ్యక్షుడికి మహేష్ సాహు ఉన్నారు. సాహు కుమారుడు అజయ్ సింగ్(35) లిధోరా లోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరుతున్న తన సహోద్యోగినికి లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు.

అందుకు ఆమె అంగీకరించడంతో కారులో ఎక్కించుకుని ఆమెను ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ కొత్వాలి పోలీసులను ఆశ్రయించింది. అజయ్ సింగ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదుచేశారు. అజయ్ పై ఐపీసీ సెక్షన్ 376(అత్యాచారం) కింద కేసు నమోదు చేశామని, అతడి కారు డ్రైవర్ ను  అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని త్వరలో అతడ్ని పట్టుకుని విచారణ చేస్తామని ఇన్ స్పెక్టర్ ఆర్.పి.చౌదరి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement