ఎంపీ వీరేంద్ర సింగ్కు స్పీకర్ మందలింపు | loksabha: opposition erupted in slogans of We want justice | Sakshi
Sakshi News home page

ఎంపీ వీరేంద్ర సింగ్కు స్పీకర్ మందలింపు

Dec 10 2015 11:56 AM | Updated on Mar 29 2019 8:33 PM

లోక్సభలో బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. సోనియా గాంధీపై వీరేంద్ర సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ

న్యూఢిల్లీ : లోక్సభలో బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. సోనియా గాంధీపై వీరేంద్ర సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలో గురువారం సభలో నిరసనకు దిగారు. ఆ వ్యాఖ్యలపై వీరేంద్రసింగ్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ 'వియ్‌ వాంట్‌ జస్టిస్‌' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

 

ఈ వ్యవహారంపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ...ఎంపీ వీరేంద్ర సింగ్ను మందలించారు. అనుచిత వ్యాఖ్యలు చేయవద్దంటూ సూచించారు.  కాగా కరువు అంశంపై మాట్లాడుతూ నిన్న ఆయన సభలో సోనియాపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వీరేంద్ర సింగ్ వ్యాఖ్యలను రికార్డులను తొలగిస్తున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement