సెలెక్ట్ కమిటీకి ‘డేటా’ బిల్లు

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో.. పౌరుల సమాచార భద్రతకు ఉద్దేశించిన ‘వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు’పై (పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు) కేంద్రప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ బిల్లును జాయింట్ సెలెక్ట్ ప్యానల్ పరిశీలనకు పంపిస్తున్నట్లు ఐటీ మంత్రి రవి శంకర్ చెప్పారు. ఈ కమిటీ బిల్లుకు సంబంధించిన నివేదికను బడ్జెట్ సమావేశాల్లోపు అందించనున్నట్లు తెలుస్తోంది. కాగా, సమాచార భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అభ్యంతరాలు లేవనెత్తడం తెల్సిందే. ఈ బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాలని కోరారు. ఆందోళనల నేపథ్యంలో బిల్లును కమిటీ పరిశీలనకు పంపారు. కమిటీలో ఎంపీలు మిథున్‌రెడ్డి, మీనాక్షి లేఖి తదితరులు ఉన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి