పశుగ్రాస స్కాంలో లాలూకు ఊరట

Jharkhand High Court Grants Bail To Lalu Yadav - Sakshi

రాంచీ : బిహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు దియోగఢ్‌ ట్రెజరీకి సంబంధించిన పశుగ్రాస కుంభకోణంలో జార్ఖండ్‌ హైకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో బెయిల్‌ కోసం లాలూ అప్పీళ్లను కోర్టు పలుమార్లు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో జూన్‌ 13న ఆర్జేడీ చీఫ్‌ లాలూ జార్ఖండ్‌ హైకోర్టులో బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు సైతం లాలూ ప్రసాద్‌ బెయిల్‌ వినతిని తిరస్కరించింది. లాలూ బెయిల్‌పై స్పందించాలని కోర్టు సీబీఐని కోరగా, లాలూకు బెయిల్‌ ఇవ్వడం తగదని సీబీఐ తీవ్రంగా ఆక్షేపించింది.

పశుగ్రాస కుంభకోణం కేసుల్లో దోషిగా తేలిన లాలూకు న్యాయస్ధానం 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తీవ్ర అస్వస్ధతతో బాధపడుతున్న లాలూ ప్రస్తుతం రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. దియోగఢ్‌ ట్రెజరీ పశుగ్రాస కేసులో లాలూకు బెయిల్‌ లభించినా ఇదే స్కామ్‌కు సంబంధించి మరో కేసులో విచారణ న్యాయస్ధానంలో పెండింగ్‌లో ఉండటంతో లాలూ జైలులోనే గడపాల్సిన పరిస్ధితి నెలకొంది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top