మంత్రి ఇంట్లో 12 కిలోల బంగారం.. రూ.112కోట్లు | it rides on karnataka minister home..crores unearthed | Sakshi
Sakshi News home page

మంత్రి ఇంట్లో 12 కిలోల బంగారం.. రూ.112కోట్లు

Jan 23 2017 5:48 PM | Updated on Oct 30 2018 5:50 PM

మంత్రి ఇంట్లో 12 కిలోల బంగారం.. రూ.112కోట్లు - Sakshi

మంత్రి ఇంట్లో 12 కిలోల బంగారం.. రూ.112కోట్లు

కర్ణాటకలో ఐటీ అధికారులు అవాక్కయారు. ఓ మంత్రి ఇంటిపై జరిపిన ఐటీ సోదాల్లో లెక్కచూపని సొమ్మును చూసి ఖిన్నులయ్యారు.

బెంగళూరు: కర్ణాటకలో ఐటీ అధికారులు అవాక్కయారు. ఓ మంత్రి ఇంటిపై జరిపిన ఐటీ సోదాల్లో లెక్కచూపని సొమ్మును చూసి ఖిన్నులయ్యారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్న సతీశ్‌ జర్కీహోలి అక్రమాస్తులు కూడ బెట్టినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా సమాచారం  తెలుసుకున్న అధికారులు సోమవారం ఆయన ఇళ్లు, బంధువుల ఇళ్లు ఇతర ఆస్తులున్న ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో రూ.12 కిలోల బంగారం, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో లెక్క చూపని డబ్బు దాదాపు రూ.112 కోట్లు ఉన్నట్లు గుర్తించి షాకయ్యారు. ప్రస్తుతానికి మంత్రి కుటుంబ సభ్యులను ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement