టాప్‌ 250లో లేని భారత యూనివర్సిటీలు

IIsc Bangalore Gets Top Position In The Country - Sakshi

ఇండియాలో టాప్‌లో నిలిచిన బెంగుళూరు ఐఐఎస్‌సీ

రెండో స్థానలో నిలిచిన ఇండోర్‌ విశ్వవిద్యాలయం

లండన్‌ : ‘ది టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌’ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాకింగ్స్‌లో భారత్‌ నుంచి ఒక్క విశ్వవిద్యాలయం కూడా చోటు దక్కించుకోలేదు. కాగా, బుధవారం విడుదలైన ఈ జాబితాలో ప్రపంచ అత్యుత్తమ యూనివర్సీటీగా ఆక్స్‌ఫర్డ్‌ తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. కేంబ్రిడ్జ్‌, స్టాన్‌ఫోర్డ్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మాసాచుసెట్స్‌ నాలుగో స్థానంలో ఉంది. 2019కి సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా 250 యూనివర్సీటీలకు టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాకింగ్స్‌ ఇచ్చింది. 

ఇదిలాఉండగా.. భారత్‌లోని అన్ని యూనివర్సిటీల్లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌-బెంగుళూరు టాప్‌లో నిలిచింది. ఐఐటీ-ఇండోర్‌, ఐఐటీ-బాంబే యూనివర్సిటీలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, ప్రపంచ అత్యుత్తమ యూనివర్సిటీల జాబితాలో చోటు దక్కించుకోని భారత్‌.. గతేడాదికంటే కొంత మెరుగు పడింది. టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ జాబితాలో భారత్‌నుంచి పోయిన సంవత్సరం 42 యూనివర్సీలు ఉండగా.. తాజాగా ఆ సంఖ్య 49కి చేరింది. దీంతో 250పైన ర్యాంకులు గల దేశాల జాబితాలో  ఇండియా అయిదో స్థానంలో నిలిచింది. ఐఐఎస్‌సీ బెంగుళూరు 251-300 ర్యాంకింగ్స్‌లో కొనసాగుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top