
న్యూఢిల్లీ: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్(ఐసీఎంఆర్)కు చెందిన సీనియర్ శాస్త్రవేత్తకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత కొద్ది రోజుల క్రితం ఇతను ముంబై నుంచి ఢిల్లీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈయన ముంబై ఐసీఎంఆర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రీప్రోడెక్టివ్ హెల్త్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.
గతవారం ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ పాల్గొన్న ఓ సమావేశానికి ఈ శాస్త్రవేత్త హాజరయ్యారు. దీంతో ఢిల్లీలోని ఐసీఎంఆర్ కార్యాలయ భవనాన్ని పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. కార్యాలయం మూతపడటంతో ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించారు.