ఐఏఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు | IAS officer involved in wealth case suspended | Sakshi
Sakshi News home page

ఐఏఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు

Nov 22 2014 1:19 PM | Updated on Sep 2 2017 4:56 PM

ప్రజా ధనాన్ని పక్కదోవ పట్టించడానే ఆరోపణలపై ఓ ఐఏఎస్ అధికారిని కేరళ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

తిరువనంతపురం: ప్రజా ధనాన్ని పక్కదోవ పట్టించాడనే ఆరోపణలపై ఓ ఐఏఎస్ అధికారిని కేరళ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కేరళలో ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వరిస్తూ అవినీతికి పాల్పడినట్లు టీవో సూరజ్ పై ఆరోపణల నేపథ్యంలో అతన్ని సస్పెండ్ చేస్తూ కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా కార్యకలాపాల విభాగంలో సెక్రటరీగా విధులు నిర్వరిస్తూ అందుకు సంబంధించిన నిధులను దుర్వినియోగం చేసినట్లు విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. గత మూడు రోజుల క్రితం ఆ అధికారి ఇంట్లో సోదాలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు భారీ మొత్తంలో నగదును, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

 

దీన్ని దృవీకరించిన కేరళ ప్రభుత్వం ఆ అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అతను అవినీతికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement