మహిళల పేరుతో రేషన్ కార్డు ఉండడానికి వీల్లేదని ఉత్తర ప్రదేశ్లో సన్నీ బరేల్వీ మర్కాజ్ దర్గా అల్ హజరత్ తాజాగా ఫత్వా జారీ చేసింది .
బరేలీ: మహిళల పేరుతో రేషన్ కార్డు ఉండడానికి వీల్లేదని ఉత్తర ప్రదేశ్లో సన్నీ బరేల్వీ మర్కాజ్ దర్గా అల్ హజరత్ తాజాగా ఫత్వా జారీ చేసింది. మహిళ పేరుతో రేషన్ కార్డా.. కుదరదు..ముమ్మాటికీ కుదరదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఫ్తీ మహమ్మద్ సలాం నూరీ.. ఈనేపథ్యంలోనే మహిళల పేరుతో రేషన్ కార్డుకు దరఖాస్తు చేయొద్దని తమ శ్రేణులను ఆదేశించామన్నారు.
భారతీయ, ఇస్లాం సంస్కృతి ప్రకారం పురుషులు మాత్రమే కుటుంబ యజమానిగా ఉండాలని, ఇంటిని స్వర్గసీమగా మార్చే బాధ్యత స్త్రీలదని పేర్కొన్నారు. దీని కనుగుణంగా చట్టంలో మార్పులు చేయాల్సిందిగా కొంతమంది పెద్దలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి కోరనున్నామని కూడా నూరీ తెలిపారు.
కుటుంబం పెద్దగా ఉన్న మహిళ పేరుతో కొత్త రేషన్ కార్డులు జారీ చేయొచ్చని నిబంధనను ఫుడ్ సెక్యూరిటీ బిల్లులో ఆమోదించిన సంగతి తెలిసిందే.