భారీ డీల్స్‌తో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ రెడీ | Flipkart & Amazon get ready for sale season  | Sakshi
Sakshi News home page

భారీ డీల్స్‌తో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ రెడీ

Jan 17 2018 11:08 AM | Updated on Aug 1 2018 3:40 PM

Flipkart & Amazon get ready for sale season  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెజాన్‌ ఇండియా గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ను ప్రకటించిన క్రమంలో ఫ్లిప్‌కార్ట్‌  అవే తేదీల్లో రిపబ్లిక్‌డే సేల్‌ను ప్రకటించింది. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా సేల్‌ను ఈనెల 21 నుంచి 24 వరకూ నిర్వహిస్తుండగా, ఈనెల 21 నుంచి 23 వరకూ రిపబ్లిక్‌ డే సేల్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేసింది. ఈ కామర్స్‌ దిగ్గజాలు ఈ ఆఫర్‌ సమయంలో పలు బ్రాండ్లపై 70 నుంచి 80 శాతం వరకూ డిస్కౌంట్‌ను ప్రకటించాయి.స్మార్ట్‌ ఫోన్లు, ఫ్యాషన్‌, హోం అప్లయెన్సెస్‌పై భారీ తగ్గింపును వర్తింపచేసేందుకు ఇరు కంపెనీలు సన్నద్ధమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌ ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, దుస్తులు, ఫుట్‌వేర్‌, ఫర్నిషింగ్‌పై 80 శాతం డిస్కౌంట్‌ను, టీవీ ఇతర ఉపకరణాలపై 70 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది.

 పూర్తిగా భారతీయ ఉత్పత్తులతో కూడిన ది ఇండియా స్టోర్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రదర్శిస్తోంది. నూతన స్మార్ట్‌ఫోన్‌ లాంఛ్‌లతో పాటు శాంసంగ్‌, యాపిల్‌, గూగుల్‌ ఫోన్లపై గ్రేట్‌ డీల్స్‌, డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఇదే తరహలో అమెజాన్‌ ఇండియా మొబైల్స్‌, ల్యాప్‌టాప్‌లు, దుస్తులు, ఎలక్ర్టానిక్స్‌, హోం, కిచెన్‌ ఉత్పత్తులపై ఆసక్తికర డీల్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. జనవరి 20 నుంచి గ్రేట్‌ ఇండియా సేల్‌లో ప్రైమ్‌ మెంబర్లకు 12 గంటల ముందు గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ అందుబాటులోకి వస్తుంది. పలు ప్రోడక్ట్‌లకు సంబంధించి పదివేలకు పైగా బ్రాండ్‌లపై భారీ డీల్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement