సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం షురూ | EC Notification issued for lok sabha election notification for first phase | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

Mar 18 2019 10:49 AM | Updated on Mar 18 2019 11:05 AM

EC Notification issued for lok sabha election notification for first phase - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో తొలి విడత లోక్‌సభ ఎన్నికల సందడి షురూ అయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా 20 రాష్ట్రాల్లోని 91 లోక్‌సభ స్థానాలకు తొలివిడత కింద ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. తెలంగాణలో 17, ఏపీలో 25 లోక్‌సభ స్థానాలుండగా మొత్తం స్థానాలకు ఒకే దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఆ రాష్ట్ర సీఈవో గోపాలకృష్ణ ద్వివేది, తెలంగాణ సీఈవో రజత్‌ కుమార్‌ ఇవాళ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెలవు రోజులు మినహా ఇతర పని దినాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 21న హోలీ పండుగ, 24న ఆదివారం సెలవులు కావడం తో నామినేషన్లు స్వీకరించరు. 25తో నామినేషన్ల స్వీకరణ గడువు పూర్తి కానుంది. 26న నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 28తో ముగియనుంది. ఏప్రిల్‌ 11న రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మే 23న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. 

ఎన్నికల నోటిఫికేషన్‌ వివరాలు ఇలా ఉన్నాయి..
నోటిఫికేషన్‌ జారీ 

నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ  18–03–2019
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ  25–03–2019
నామినేషన్ల పరిశీలన     26–03–2019
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ  28–03–2019
పోలింగ్‌ తేదీ    11–04–2019
ఓట్ల లెక్కింపు   23–05–2019  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement