‘లాక్‌డౌన్‌’ ఆంక్షలు.. సడలింపులు..

COVID-19: New Coronavirus Lockdown Guidelines Released - Sakshi

ఏప్రిల్‌ 20 నుంచి కొన్ని నిబంధనల సడలింపు

హాట్‌స్పాట్స్, కంటైన్మెంట్‌ సెంటర్లలో మినహాయింపులు లేవు

‘లాక్‌డౌన్‌’ మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర హోంశాఖ

సాక్షి, న్యూఢిల్లీ: రెండో దశ లాక్‌డౌన్‌కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. బయటకు వెళ్లినప్పుడు మాస్క్‌ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని శిక్షించదగ్గ నేరంగా నిర్ధారించారు. మద్యం, గుట్కా, పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించారు. అన్ని రకాల ప్రజా రవాణాను మే 3వ తేదీ వరకు నిషేధించింది. గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలు ఏప్రిల్‌ 20 వ తేదీ నుంచి కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. అయితే, వాటిలోని కార్మికులు, సిబ్బంది భౌతిక దూరం సహా అన్ని సాధారణ లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించాలి. మే 3వ తేదీవరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

కరోనా వైరస్‌ ప్రభావం లేని ప్రాంతాల్లో ఏప్రిల్‌ 20 తరువాత కొన్ని కార్యకలాపాలకు అనుమతిస్తామని కూడా ఆయన చెప్పారు. అందులో భాగంగానే లాక్‌డౌన్‌ కాలంలో ఆచరించాల్సిన, ఆచరించకూడని చర్యలతో కూడిన సమగ్ర మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. నిబంధనల సడలింపు వైరస్‌ హాట్‌ స్పాట్స్‌కు, కంటైన్మెంట్‌ జోన్స్‌కు వర్తించబోదని స్పష్టం చేసింది. తాము నిర్దేశించిన నిబంధనలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కచ్చితంగా పాటించాలని, అవసరమైతే, స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని, మరింత కఠినమైన ఆంక్షలను విధించవచ్చని పేర్కొంది. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే లక్ష్యంతో ఏప్రిల్‌ 20 నుంచి పలు నిబంధనలను సడలించారు. వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగడం, ధాన్య సేకరణ జరగడం, దినసరి, రైతు కూలీలకు ఉపాధి కల్పించడం ఈ నిబంధనల సడలింపు ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. 

మార్గదర్శకాలివీ..
► అన్ని పని ప్రదేశాల్లో థర్మల్‌ స్క్రీనింగ్, శానిటైజర్‌ సదుపాయాలను కల్పించాలి.
► ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్‌ వర్కర్లు, ప్లంబర్లు, మోటారు మెకానిక్‌లు, కార్పెంటర్లు తమ పనులు చేసుకోవచ్చు.
► మే 3 వరకు అంతర్రాష్ట్ర, అంతర్‌జిల్లా ప్రయాణాలు నిషేధం. అందువల్ల మే 3 వరకు బస్సు, మెట్రో సర్వీసులు కూడా నడవవు.
► ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి ఎస్‌ఈజెడ్‌ల్లోని పరిశ్రమలు, ఎగుమతులు చేసే పారిశ్రామిక కేంద్రాలు, ఇతర పారిశ్రామిక టౌన్‌ షిప్స్‌ కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చు.
► విద్యా సంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు, రైలు సర్వీసులు, సినిమా హాల్స్, షాపింగ్‌ మాల్స్, జిమ్స్, క్రీడాకేంద్రాలు, ఈత కొలనులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ పై మే 3 వరకు నిషేధం కొనసాగుతుంది.
► మత ప్రాంతాలు, ప్రార్థనాకేంద్రాలను మే 3 వరకు మూసేయాలి. అప్పటివరకు రాజకీయ,క్రీడ, సామాజిక, మత కార్యక్రమాలపై కూడా నిషేధం కొనసాగుతుంది.
► హైవేలపై ఉన్న దాబాలు(హోటళ్లు), ట్రక్‌ రిపేరింగ్‌ షాప్స్, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన కాల్‌ సెంటర్లు ఏప్రిల్‌ 20 నుంచి కార్యకలాపాలను ప్రారంభించవచ్చు.
► వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన సామగ్రిని అమ్మే, వాటిని మరమ్మత్తులు చేసే షాపులను ఏప్రిల్‌ 20 నుంచి తెరవొచ్చు. వ్యవసాయ, పండ్ల తోటల రంగాలకు సంబంధించిన కార్యకలాపాలను నేటి నుంచే ప్రారంభించవచ్చు.
► ఔషధ, వైద్య పరికరాల తయారీ యూనిట్లు, ఆరోగ్య మౌలిక వసతులకు సంబంధించిన యూనిట్లు ఏప్రిల్‌ 20 నుంచి కార్యకలాపాలను ప్రారంభించవచ్చు.
► లాక్‌డౌన్‌ సమయంలో కిరాణా షాపులు, పండ్లు, కూరగాయల దుకాణాలు/బండ్లు, మిల్క్‌ బూత్స్, మాంసం, చేపలు అమ్మే దుకాణాలు తెరిచే ఉంటాయి.
► అనుమతించిన పరిశ్రమలు ఫ్యాక్టరీ ప్రాంగణం, లేదా దగ్గర్లోని భవనాల్లో సిబ్బంది, ఇతర కార్మికులు ఉండేందుకు సదుపాయాలు కల్పించాలి. భౌతిక దూరం తదితర నిబంధనలను అమలు చేయాలి.
► రక్షణ, పారా మిలటరీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, విపత్తు నిర్వహణ, ఎన్‌ఐసీ, ఎఫ్‌సీఐ, ఎన్‌సీసీ, నెహ్రూ యువ కేంద్ర, కస్టమ్స్‌ కార్యాలయాలు యథావిధిగా పనులు చేసుకోవచ్చు. మిగతా శాఖల్లో డిప్యూటీ సెక్రటరీ ఆపై హోదా ఉన్న అధికారులు కచ్చితంగా 100% హాజరు పాటించాలి. మిగతా ఉద్యోగులు అవసరాన్ని బట్టి 33% వరకు హాజరయ్యేలా చూసుకోవాలి. ప్రజల అవసరాలను బట్టి, అవసరమైన ఇతర కార్యకలాపాలకు రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగాలు ఏప్రిల్‌ 20 నుంచి అనుమతినివ్వవచ్చు.
► లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నియమిత సంఖ్యలో పారిశ్రామిక కార్యకలాపాలకు అనుమతినిచ్చారు.
► ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో కార్యకలాపాలు, ఈ కామర్స్‌ కార్యకలాపాలు, డేటా, కాల్‌ సెంటర్‌ విధులు, ఆన్‌లైన్‌ బోధన, దూరవిద్య విధానాలను కొనసాగించవచ్చు.
► నిత్యావసర వస్తువులను నేరుగా వినియోగదారుల ఇళ్ల వద్దకే సరఫరా చేసే విధానాన్ని అధికారులు ప్రోత్సహించాలి.
► బ్యాంకులు, బీమా కార్యాలయాలు, నగదు నిర్వహణ సంస్థలు, ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా సంస్థలు యథావిధిగా పనిచేస్తాయి.
► అన్ని సంస్థలు వీలైనంత వరకు ఉద్యోగులు తమ ఇళ్లలో నుంచే విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలి.
► ఆహారం, ఔషధాలు, వైద్య పరికరాలను సరఫరా చేసే ఈ కామర్స్‌ సంస్థలకు అనుమతి.
► కచ్చితంగా కొనసాగించాల్సిన అవసరం ఉన్న ఉత్పత్తి సంస్థలు రాష్ట్రాల అనుమతితో పనులు చేపట్టవచ్చు.  
► బొగ్గు, ఇతర ఖనిజ ఉత్పత్తిలో ఉన్న సంస్థలు పనులు ప్రారంభించవచ్చు.
► ఎరువులు, పురుగుమందులు, విత్తనాల ఉత్పత్తి సంస్థలు విధులు ప్రారంభించవచ్చు.
► నిత్యావసర, నిత్యావసరంకానివి అనే భేదం లేకుండా అన్ని వస్తువుల రవాణాకు అనుమతినిచ్చారు.
► అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాల్లో 20 మందికి మించి పాల్గొనరాదు.
► రోడ్లు, భవనాలు, సాగునీటి పారుదల ప్రాజెక్టులు, ఇతర పారిశ్రామిక ప్రాజెక్టులు, పునరుత్పాదిత ఇంధన రంగంలోని ప్రాజెక్టులు, గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల్లో నిర్మాణ పనులకు అనుమతినిచ్చారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

19-01-2021
Jan 19, 2021, 12:57 IST
సాక్షి, ముంబై: ఒకవైపు కరోనా  మహమ్మారి అంతానికి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు  సీరం వ్యాక్సిన్‌ తీసుకున్న 24...
19-01-2021
Jan 19, 2021, 08:45 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకాల కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుందో తెలియట్లేదు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణీత...
19-01-2021
Jan 19, 2021, 08:06 IST
బెంగళూరు : వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం రెండు మరణాలు సంభవించడం దేశంలో కలకలం రేపుతోంది. ఒకరు ఉత్తరప్రదేశ్‌లోనూ, మరొకరు కర్ణాటకలోనూ...
19-01-2021
Jan 19, 2021, 03:16 IST
సాక్షి, అమరావతి/ భీమడోలు: హెల్త్‌కేర్‌ వర్కర్లకు నిరంతరాయంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియలో భాగంగా మూడో రోజు రాష్ట్రంలో 14,606...
18-01-2021
Jan 18, 2021, 20:35 IST
సాక్షి,  హైదరాబాద్ : కరోనా వ్యాక్సినేషన్‌ తీసుకున్న వారిలో కొంతమంది అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో వాక్సిన్‌ తీసుకున్న ఏడుగురు ఒళ్లు నొప్పులు,...
18-01-2021
Jan 18, 2021, 15:28 IST
సాక్షి, ముంబై : దేశ వ్యాప్తంగా శనివారం నుంచి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. శనివారం మొదటి ఫేజ్‌...
18-01-2021
Jan 18, 2021, 10:54 IST
సాక్షి, లక్నో : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి నివారణకుగాను ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌లకు వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన తరుణంలో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో విషాదం చోటు...
18-01-2021
Jan 18, 2021, 05:52 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్ర జనాభాలో ఏకంగా 20 శాతానికి పైగా...
18-01-2021
Jan 18, 2021, 03:55 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ప్రక్రియ రెండో రోజూ చురుగ్గా కొనసాగింది. ఉదయం 9 గంటలకే వ్యాక్సిన్‌ ప్రక్రియ...
17-01-2021
Jan 17, 2021, 15:07 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్న వేళ, దేశ రాజధాని ఢిల్లీలో వ్యాక్సిన్‌...
17-01-2021
Jan 17, 2021, 13:28 IST
‘మా అన్నయ్య చనిపోయాడు. ఇంక నాకీ లోకంలో ఎవరూ లేరు’ అని  ఓ అమ్మాయి ఏడుస్తుంటే..  ‘అయ్యో.. అలా అనకు.. నీకు నేనున్నా’...
17-01-2021
Jan 17, 2021, 10:13 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనాపై అవగాహన కోసం కేంద్రం ఆదేశాల మేరకు ప్రతి టెలికాం సంస్థ విధిగా వినిపిస్తోన్న కాలర్...
17-01-2021
Jan 17, 2021, 05:49 IST
బీజింగ్‌: బీజింగ్‌ దక్షిణ ప్రాంతంలో కరోనా కేసులు తిరిగి నమోదవుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం కేవలం 5 రోజుల్లోనే 1,500...
17-01-2021
Jan 17, 2021, 05:43 IST
న్యూఢిల్లీ/హైదరాబాద్‌: ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ టీకా మాత్రమే తమకు ఇవ్వాలని ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా(ఆర్‌ఎంఎల్‌) ఆసుపత్రి రెసిడెంట్‌...
17-01-2021
Jan 17, 2021, 05:34 IST
బీజింగ్‌: కరోనా వైరస్‌ జాడలున్న 4,800 ఐస్‌క్రీం బాక్సులను చైనా అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమై ఈ వైరస్‌ ఎక్కడి...
17-01-2021
Jan 17, 2021, 05:22 IST
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్దదయిన కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారత్‌లో శనివారం ప్రారంభమైంది. తొలి దశలో దేశవ్యాప్తంగా వేలాది మంది...
17-01-2021
Jan 17, 2021, 05:04 IST
ఓస్లో: కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నార్వేలో తీవ్ర విషాదం మిగిల్చింది. ఇటీవల ఫైజర్‌వ్యాక్సిన్‌ తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి...
17-01-2021
Jan 17, 2021, 04:56 IST
భారత్‌లో ఉత్పత్తి చేసిన టీకాలతో కరోనా మహమ్మారిపై నిర్ణయాత్మక విజయం సాధించడం తథ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం...
17-01-2021
Jan 17, 2021, 03:23 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలి రోజు కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ విజయవంతమైంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు...
16-01-2021
Jan 16, 2021, 19:31 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తొలిరోజు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తైంది. నేడు మొత్తంగా 1,65,714 మంది కరోనా నిరోధక వ్యాక్సిన్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top