మూక హత్యలపై కేంద్రం రియాక్షన్‌ ఇదే..

Centre Says Maintaining Law And Order Is A State Subject - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న మూక హత్యలను నిరోధించేందుకు కఠిన చట్టం అవసరమనే చర్చ ఊపందుకున్న క్రమంలో శాంతిభద్రతల నిర్వహణ రాష్ట్రాల పరిధిలోని అంశమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బుధవారం రాజ్యసభలో హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ మాట్లాడుతూ పోలీసులు, శాంతి భద్రతల పర్యవేక్షణ రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌ ప్రకారం రాష్ట్ర అంశాలని పేర్కొన్నారు.

గత ఆరు నెలల కాలంలో మూక హత్యలు, సామూహిక దాడులు పెరిగాయా అని సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. నేరాలను నియంత్రించడం, వాటిని గుర్తించడం, తమ యంత్రాంగం ద్వారా నేరస్తులను ప్రాసిక్యూట్‌ చేయడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతని చెప్పుకొచ్చారు. దేశంలో మూకదాడులు, హత్యలకు సంబంధించి జాతీయ నేర రికార్డుల బ్యూరో నిర్ధిష్ట సమాచారం నిర్వహించడం లేదని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top