కళ్ల ముందే కొట్టుకుపోయారు.. | Bridge Breaks in Flood-hit Bihar | Sakshi
Sakshi News home page

కళ్ల ముందే కొట్టుకుపోయారు..

Aug 18 2017 1:50 PM | Updated on Sep 17 2017 5:40 PM

కళ్ల ముందే కొట్టుకుపోయారు..

కళ్ల ముందే కొట్టుకుపోయారు..

రాష్ట్రం వరదలతో వణికిపోతోంది.

బీహార్‌: రాష్ట్రం వరదలతో వణికిపోతోంది. దీంతో రోజు రోజుకి మృతుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కసారిగా ఉప్పొంగిన వరదతో ఓ వంతెన కూలిపోయింది. అందరూ చూస్తుండగానే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వంతెన కూలి వరదల్లో కొట్టుకుపోయిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన అరారియా జిల్లాలో చోటుచేసుకుంది. వరద కారణంగా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటిలో మునిగిపోయాయి. సహయక చర్యలో భాగంగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న తరుణంలో విషాదం చోటుచేసుకుంది.

అప్పటికే  అంచులు కూలిపోయిన వంతెనని దాటే క్రమంలో ఒక్కసారిగా కూలిపోయి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వరదలో కొట్టకుపోయారు. వంతెన చివరి దాకా చేరిన వారు ఒక్క అడుగు వేస్తే ప్రాణాలు మిగిలేవి. అడుగు దూరంలో వారి ఆయువు ఆవిరైపోయింది. బిహార్‌లో భారీ వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement