నలుగురు సైనికులను మింగిన మంచు | Avalanche kills 4 soldiers in Kashmir | Sakshi
Sakshi News home page

నలుగురు సైనికులను మింగిన మంచు

Apr 4 2015 6:49 PM | Updated on Oct 22 2018 8:44 PM

నలుగురు సైనికులను మింగిన మంచు - Sakshi

నలుగురు సైనికులను మింగిన మంచు

హిమాలయాల్లో ఏర్పడిన భారీ హిమపాతం నలుగురు సైనికులను పొట్టనబెట్టుకుంది.

హిమాలయాల్లో ఏర్పడిన భారీ హిమపాతం నలుగురు సైనికులను పొట్టనబెట్టుకుంది. లేహ్ జిల్లాలోని చాంగ్లా గ్రామంలో విధులు నిర్వహిస్తోన్న సైనికులపై మంచు చరియలు విరిగిపడటంతో మృత్యువాత పడ్డారని జిల్లా ఉన్నతాధికారి స్వాగత్ విశ్వాస్ శనివారం వెల్లడించారు.  

మంచులో కూరుకుపోయిన మృతదేహాలకోసం సైన్యం గాలింపు చర్యలు చేపట్టిందని, తీవ్ర ప్రతికూల పరిస్థితుల నడుమ ముగ్గురి దేహాలు మాత్రమే వెలికితీసినట్లు, మరో దేహంకోసం గాలింపు ముమ్మరం చేశారని విశ్వాస్ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement