
భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి (పాత ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : భారత మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్(బీజేపీ) యోధుల్లో ఒకరైన అటల్ బిహారీ వాజ్‌పేయి(93) మరణించినట్లు సోషల్‌మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. వాట్సాప్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా షేర్ అవుతోన్న పోస్టు మరణానికి రకరకాల కారణాలను పేర్కొంది.
కాగా 2015లో కూడా ఇలానే వాజ్‌పేయి ఇక లేరంటూ నకిలీ వార్తలు వెలువడ్డాయి. సహోధ్యాపకుడు అందించిన సమాచారంతో స్కూల్‌కు సెలవు ప్రకటించిన ఓ హెడ్‌మాస్టర్ అసలు విషయం తెలిసి నాలుక్కరచుకున్నారు. స్కూల్‌కు సెలవు ప్రకటించిన హెడ్ మాస్టర్‌పై కలెక్టర్ చర్యలు కూడా తీసుకున్నారు.
దేశానికి ఎన్నో సేవలు అందించిన వాజ్‌పేయి మరణించారంటూ ఫేక్ న్యూస్ వైరల్ కావడం దురదృష్టకరం. భారత ప్రధానిగా పని చేసిన వాజ్‌పేయి ఉత్తమ పార్లమెంటెరియన్‌గా అవార్డును అందుకున్నారు. 2015లో ఆయన దేశానికి చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం భారతరత్న అవార్డును అందజేసింది.
ఓ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ అవుతోన్న మెసేజ్