'వారణాసిలో పోటీకి మోడీ సిద్దమైతే కేజ్రివాల్ కూడా రెఢీ'
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆదివారం సవాల్ విసిరారు
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆదివారం సవాల్ విసిరారు. వారణాసిలో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ మాట్లాడుతూ... వారణాసి లోకసబ నియోజకవర్గంలో మోడీ పోటీ చేయడానికి సిద్ధమైతే..కేజ్రివాల్ కూడా బరిలోకి దిగడానికి రెఢీగా ఉన్నారు అని అన్నారు.
ముఖేష్ అంబానీపై కేజ్రివాల్ చేసిన ఆరోపణలకు వారణాసి ప్రజలు స్పందించాలని ఆప్ నేత మనీష్ సిసోడియా విజ్క్షప్తి చేశారు. వారణాసి వేదిక నుంచి అంబానీలపై కేజ్రివాల్ చేసిన ఆరోపణలకు మోడీ కూడా సమాధానమివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే అనంతరం ఇదే ర్యాలీలో ప్రసంగించిన కేజ్రివాల్.. అలహాబాద్ నుంచి పోటీ చేయడంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.