‘చంద్రయాన్‌ గుండెచప్పుడు వినగలుగుతున్నాం’

Anand Mahindra Emotional Tweet Over Chandrayaan 2 - Sakshi

న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 సక్సెస్‌పై సందిగ్ధత కొనసాగుతున్న వేళ పలువురు ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా నిలుస్తున్నారు. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు  సజావుగా సాగిన విక్రమ్‌ ల్యాండర్‌ ప్రయాణంలో కుదుపులు చోటుచేసుకున్నప్పటికీ శాస్త్రవేత్తల శ్రమకు ఎప్పటికైనా ఫలితం దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రయాన్‌ 2 యాత్ర ప్రారంభం నుంచి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై స్పందిస్తున్న పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర భావోద్వేగ ట్వీట్‌ చేశారు. మూన్‌లాండర్‌తో ఇస్రోకు సిగ్నల్స్‌ తెగిపోయిన తర్వాత..‘ సంబంధాలు తెగిపోలేదు. చంద్రయాన్‌ గుండెచప్పుడును ప్రతీ భారత పౌరుడు వినగలుగుతున్నాడు. తొలిసారి విజయం సాధించకపోతే... మళ్లీ మళ్లీ ప్రయత్నించండి అంటూ తాను చెప్పే గుసగుసలు వినగలుగుతున్నాడు’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

చదవండి: చంద్రయాన్‌ టెన్షన్‌.. అందినట్టే అంది..

అదే విధంగా విక్రమ్ ల్యాండర్‌ చంద్రుడిని చేరే అపురూప క్షణాల కోసం యావత్‌ భారతావని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన వేళ అనుకోని ఫలితం ఇస్రో బృందం శ్రమను నాశనం చేయలేదని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ‘ చంద్రయాన్‌ 2 మిషన్‌ కోసం కష్టపడిన ఇస్రో టీంకు అభినందనలు. పని పట్ల మీ అంకితభావం ప్రతీ భారత పౌరుడికి స్పూర్తిదాయకం. మీ శ్రమ వృథాపోదు. ఈ ప్రయోగం ఎన్నెన్నో ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధనలకు పునాదిగా నిలిచింది’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top