వాజ్‌పేయి ఆరోగ్యంపై రాజ్‌నాథ్, అమిత్‌షా వాకబు 

Amit Shah And Rajnath Singh Inquiry About Vajpayee Health - Sakshi

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) ఆరోగ్య పరిస్థితిపై హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అమిత్‌ షా శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో వాజ్‌పేయి చికిత్స పొందుతున్న ఎయిమ్స్‌కు వెళ్లి, వైద్యులతో మాట్లాడారు. అనంతరం రాత్రి 8.15 గంటలకు హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎయిమ్స్‌కు వెళ్లారు. వాజ్‌పేయి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. మూత్ర సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబసభ్యులు జూన్‌ 11వ తేదీన ఎయిమ్స్‌లో చేర్పించారు. ప్రస్తుతం వాజ్‌పేయి కిడ్నీ ఒక్కటే పనిచేస్తోంది. ఆయనకు డయాబెటిస్‌తోపాటు డిమెన్షియా ఉంది.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top