ఇన్ఫార్మర్లనే నెపంతో ఆరుగురిని మావోయిస్టులు హతమార్చారు.
ఆరుగురిని హతమార్చిన మావోలు
Jun 28 2016 5:58 PM | Updated on Nov 6 2018 4:37 PM
రాంచి: ఇన్ఫార్మర్లనే నెపంతో ఆరుగురిని మావోయిస్టులు హతమార్చారు. జార్ఖండ్ రాజధాని రాంచికి 20 కిలోమీటర్ల దూరంలో శరీరంలో బుల్లెట్లతో కూడిన ఆరుగురి మృత దేహాలను గుర్తించినట్టు, ఇందులో ఒకరికి నేరచరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. నిషేధిత మావోయిస్టు సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఈ ఘటనకు బాధ్యత వహించింది. గడిచిన 24 గంటల్లో ఇది మావోల రెండో దాడి. నిన్న ముగ్గురు యువకులను మావోలు హతమార్చిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement