బిగ్‌బీకి 2 కోట్ల ఫాలోవర్లు | 2 crore followers to bigbi | Sakshi
Sakshi News home page

బిగ్‌బీకి 2 కోట్ల ఫాలోవర్లు

Mar 24 2016 2:06 AM | Updated on Aug 15 2018 6:34 PM

బిగ్‌బీకి 2 కోట్ల ఫాలోవర్లు - Sakshi

బిగ్‌బీకి 2 కోట్ల ఫాలోవర్లు

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను ట్విటర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 2 కోట్లకు చేరుకుంది.

ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను ట్విటర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 2 కోట్లకు చేరుకుంది. మైలురాయిని దాటిన సందర్భంగా బిగ్‌బీ అభిమానులు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ట్విటర్ ఫాలోవర్ల సంఖ్యలో ప్రధాని నరేంద్ర మోదీకి 1.88 కోట్లమంది ఫాలోవర్లు, షారూఖ్ ఖాన్‌కు 1.86 కోట్లమంది, ఆమిర్‌ఖాన్‌కు 1.69 కోట్లమంది, సల్మాన్‌ఖాన్‌కు 1.68 కోట్ల మంది, ప్రియాంకా చోప్రాకు 1.32 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

2 కోట్ల ఫాలోవర్ల మార్క్ దాటిన సందర్భంగా బుధవారం అమితాబ్ తన ఆనందాన్ని ట్విటర్‌లో పంచుకున్నారు. ‘బడుంబా.. 20 మిలియన్! అందరికీ ధన్యవాదాలు.. ఇప్పుడు 30 మిలియన్లకు పయనం.. మీ సమయం మొదలైంది..’ అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement