‘పాగల్‌’గా ‘ఫలక్‌నుమా దాస్‌’

Vishwak Sen And Bekkem Venugopal Join Hands for Paagal - Sakshi

టాటా బిర్లా మధ్యలో లైలా, మేం వయసుకు వచ్చాం, సినిమా చూపిస్తా మామా లాంటి సినిమాలు అందించిన లక్కీ మీడియా బ్యానర్, రీసెంట్ గా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ హుషారు తో మరో హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్‌ ఇప్పుడు మరో క్రేజీ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

ఇటీవల ఫలక్‌నమా దాస్‌తో సక్సెస్‌ను సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్ తో కలిసి ‘పాగల్’ అనే కొత్త చిత్రం నిర్మించనున్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్. ఈ మూవీతో నరేష్ రెడ్డి కుప్పిలి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. క్రేజీ లవ్ స్టొరీగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ ద్వితీయార్థం నుండి మొదలుకానుంది.

ఈ సందర్బంగా నిర్మాత బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ.. ‘ఫలక్ నమా దాస్ లాంటి సూపర్ హిట్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన హీరో విశ్వక్ సేన్‌తో  మా లక్కీ మీడియా బ్యానర్ నెక్ట్ ప్రాజెక్ట్ చేయడం హ్యాపీగా ఉంది. మా గత చిత్రం  హుషారు సక్సెస్ మాకు మరిన్ని మంచి చిత్రాలు చేయడానికి, కొత్త వాళ్ళను ఇంట్రడ్యూస్ చేయడానికి మంచి ఉత్సాహన్నిచ్చింది.

ఈ మూవీ తో మా బ్యానర్ ద్వారా నరేష్ రెడ్డి కుప్పిలి అనే మరో యంగ్ డైరెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. తను చెప్పిన ఇంట్రెస్టింగ్ పాయింట్‌కు అందరం బాగా కనెక్ట్ అయ్యాం.ఈ పాగల్ మూవీ బెస్ట్ లవ్ స్టొరీ అవుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. సెప్టెంబర్ ద్వితీయార్థం నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. మిగతా వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’ అన్నారు.

  దర్శకుడు నరేష్ రెడ్డి కుప్పిలి, నిర్మాత బెక్కం వేణుగోపాల్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top