తోడు దొరికింది | Vishal to get engaged to Arjun Reddy actress Anisha Alla Reddy | Sakshi
Sakshi News home page

తోడు దొరికింది

Jan 17 2019 12:31 AM | Updated on Jan 17 2019 12:31 AM

Vishal to get engaged to Arjun Reddy actress Anisha Alla Reddy - Sakshi

విశాల్‌, అనీషా అల్లా

హీరో విశాల్‌ పెళ్లికొడుకు కాబోయే తరుణం ఆసన్నమైంది. త్వరలో ఆయన వివాహం హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి అనీషా అల్లాతో జరగనుంది. ‘అర్జున్‌ రెడ్డి, పెళ్ళిచూపులు’ చిత్రాల్లో నటించారు అనీషా. ‘‘నా జీవిత ప్రయాణంలో నాకు తోడుగా ఉండే వ్యక్తి నాకు దొరికాడు. ఈ రోజు నేను ఇలా ఉండటానికి భాగమైన వ్యక్తికి చాలా థ్యాంక్స్‌. త్వరలో మరో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాం’’ అని విశాల్‌ను ఉద్దేశిస్తూ అనీషా చెప్పుకొచ్చారు. ‘‘ఇట్స్‌ కన్ఫార్డ్మ్‌. ఆమె అంగీకరించింది. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు అనీషా అల్లా అని చెప్పడానికి సంతోషంగా ఉంది. నా జీవితంలో తర్వాతి పెద్ద మార్పుకు రెడీ అవుతున్నాను. త్వరలో పెళ్లి తేదీని ప్రకటిస్తాం’’ అని విశాల్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement