భైరవ విజయం | Vijay and Keerthy Suresh's Bairavaa | Sakshi
Sakshi News home page

భైరవ విజయం

May 2 2017 11:45 PM | Updated on Sep 5 2017 10:13 AM

భైరవ విజయం

భైరవ విజయం

తమిళ స్టార్‌ హీరో విజయ్, మలయాళ బ్యూటీ కీర్తీ సురేశ్‌ జంటగా జగపతిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘భైరవ’.

తమిళ స్టార్‌ హీరో విజయ్, మలయాళ బ్యూటీ కీర్తీ సురేశ్‌ జంటగా జగపతిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘భైరవ’. భరతన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని పుష్యమి ఫిల్మ్‌ మేకర్స్‌పై ‘దృశ్య కావ్యం’ దర్శక– నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి ‘విజయ భైరవ’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘భైరవ లక్ష్యం ఏంటి? అతనికి దక్కిన విజయం ఏంటి? అనేది కథాంశం. ఫ్యామిలీ అండ్‌ యాక్షన్‌ ఓరియంటెడ్‌ చిత్రమిది. తమిళంలో ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ బాగుంది. విజయ్, కీర్తీ సురేశ్‌ల నటన ప్రేక్షకులను అలరిస్తుంది. జగపతి బాబు నటన ఈ సినిమాకే ౖహె లైట్‌. ఈ నెలాఖరులో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ నారాయణ్, పాటలు: వెన్నెలకంటి, మాటలు: ఘంటసాల రత్నకుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement