ఖైదీ, శాతకర్ణిలకు గురు విషెస్ | Venkatesh Wishes for Bala krishna and Chiranjeevi | Sakshi
Sakshi News home page

ఖైదీ, శాతకర్ణిలకు గురు విషెస్

Jan 10 2017 12:50 PM | Updated on Sep 5 2017 12:55 AM

ఖైదీ, శాతకర్ణిలకు గురు విషెస్

ఖైదీ, శాతకర్ణిలకు గురు విషెస్

చాలా కాలం తరువాత ఈ సంక్రాంతి పండుగ సినీ అభిమానులకు కిక్ ఇస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి తలపడుతుండటంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు

చాలా కాలం తరువాత ఈ సంక్రాంతి పండుగ సినీ అభిమానులకు కిక్ ఇస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి తలపడుతుండటంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ పోటిని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఖైదీ నంబర్ 150తో చిరంజీవి, గౌతమీపుత్ర శాతకర్ణితో నందమూరి బాలకృష్ణలు ఒకేసారి బరిలో దిగుతుండటంతో ఈ ఇరు కుంటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారు ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

వారం గ్యాప్ లో బరిలో దిగుతున్న మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా చిరు బాలయ్య ల సినిమాలపై స్పందించాడు.  'ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రెండు భారీ చిత్రాలు. ఇద్దరు అద్భుత నటులు, మంచి స్నేహితులు. ఫెస్టివల్ వీకెండ్. మనమందరం ఈ సంక్రాంతిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు మంచి కారణం. ఇరు చిత్రాల యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు'. అంటూ తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశాడు వెంకీ. అంతేకాదు చాలా కాలం క్రితం చిరు, బాలయ్యలతో కలిసి వెంకటేష్ దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను ఈ కామెంట్ తో పాటు పోస్ట్ చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement