సల్మాన్‌ఖాన్ తో పెళ్లికి నేను రెడీ... | Trisha Krishnan wants to marry Salman Khan | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ఖాన్ తో పెళ్లికి నేను రెడీ...

Jan 1 2014 11:41 PM | Updated on Sep 2 2017 2:11 AM

త్రిష

త్రిష

‘పెళ్లి ప్రతిపాదన తెస్తే... సినీ స్టార్స్‌లో ఎవర్ని ఓకే చేస్తారు?’ అని త్రిషను అడిగితే, ‘సల్మాన్‌ఖాన్’ అని తడుముకోకుండా సమాధానమిచ్చేశారు.

 ‘పెళ్లి ప్రతిపాదన తెస్తే... సినీ స్టార్స్‌లో ఎవర్ని ఓకే చేస్తారు?’ అని త్రిషను అడిగితే, ‘సల్మాన్‌ఖాన్’ అని తడుముకోకుండా సమాధానమిచ్చేశారు. దేశంలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో సల్లూభాయ్ ఒకరు అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయితే... త్రిష మనసులో కూడా ఈ కండలవీరుడే ఉన్నాడని తెలుసుకొని అక్కడున్నవారందరూ కాస్తంత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇటీవలే జీవాతో ఆమె నటించిన ‘ఎడ్రెన్‌డమ్ పున్నాగై’ చిత్రం విడుదలై త్రిషకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
 
  తమిళంలో త్రిషకు మళ్లీ పూర్వవైభవం తెచ్చిపెట్టిందీ సినిమా. ఇప్పుడు కోలీవుడ్‌లో ఎక్కడ చూసినా ఆ సినిమాలో త్రిష నటన గురించే చెప్పుకుంటున్నారు. ఈ విజయంతో త్రిష కెరీర్ మళ్లీ ఊపందుకుంది. దీంతో ఆమె పెళ్లిపై వినిపిస్తున్న వార్తలకు పుల్‌స్టాప్ పడ్డట్టే అని అందరూ అనుకుంటున్న సమయంలో సల్మాన్‌పై తన మనోగతాన్ని వ్యక్తం చేసి మళ్లీ చర్చకు తెరతీశారు త్రిష. ‘‘సల్మాన్ ఒప్పుకుంటే తనను పెళ్లాడటానికి నేను రెడీ’ అని సీరియస్‌గా త్రిష ఇచ్చిన  సమాధాన ం సల్లూభాయ్‌పై తనకున్న ప్రేమను బహిర్గతం చేస్తోంది కదూ!
 

Advertisement
 
Advertisement
Advertisement