
రాయుడికి హీరోయిన్ల అభినందనలు
స్వతహాగా తెలుగువాడైనా కోలీవుడ్లో దుమ్ము రేపుతున్న హీరో విశాల్. అతడు హీరోగా చేస్తున్న తాజా సినిమా రాయుడు.
స్వతహాగా తెలుగువాడైనా కోలీవుడ్లో దుమ్ము రేపుతున్న హీరో విశాల్. నడిగర సంఘం ప్రధాన కార్యదర్శిగా కూడా ఎన్నికైన విశాల్ అక్కడ, ఇక్కడ చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. విశాల్ హీరోగా చేస్తున్న తాజా సినిమా రాయుడు. ఈ సినిమా తెలుగులో కూడా విడుదలవుతోంది. అతడి సరసన శ్రీదివ్య హీరోయిన్గా నటిస్తోంది. ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా టీజర్ను మంగళవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్లు విశాల్ను అభినందనలతో ముంచెత్తారు. తన స్నేహితుడు విశాల్, మొత్తం రాయుడు టీమ్కు ఆల్ ద బెస్ట్ అంటూ శ్రుతిహాసన్ ట్వీట్ చేసింది. దాంతోపాటు సినిమా టీజర్ లింకును కూడా ఆమె ట్వీట్ చేసింది. రాయుడు టీజర్ అద్భుతంగా ఉందని, అందరూ ఇక్కడ చూడాలని చెబుతూ తమన్నా కూడా ఈ టీజర్ను ట్వీట్ చేసింది. విశాల్కు సక్సెస్ రావాలని ఆశిస్తున్నట్లు చెప్పింది. ఇక ఇటీవలి కాలంలో వరుస హిట్లతో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా విశాల్కు, రాయుడు సినిమాకు ఆల్ ద బెస్ట్ చెబుతూ ట్విట్టర్లో కామెంట్ పోస్ట్ చేసింది. ఇలా టాప్ హీరోయిన్లందరూ ఒకరి వెంట ఒకరు రాయుడికి అభినందనలు చెబుతున్నారు.
Wishing my dear friend @VishalKOfficial and d entire team of Rayudu all the very best !! Here's the trailer tweeps ! https://t.co/W6Tl0IHMoU
— shruti haasan (@shrutihaasan) 3 May 2016
Check out this amazing teaser of #rayudu https://t.co/9T5Z6Rp128 all the best @VishalKOfficial wishing you all the success!!!
— Tamannaah Bhatia (@tamannaahspeaks) 3 May 2016
Wishing @VishalKOfficial all d best 4 his next #Rayudu . Good luck to d team..here goes d trailer https://t.co/0iaX9gZTd8
— Rakul Preet (@Rakulpreet) 3 May 2016