పెళ్లి కాని యువతుల కథ

పెళ్లి కాని యువతుల కథ


‘‘జీవితంలో మరచిపోలేని, మధురమైన రోజు పెళ్లిరోజు. పెళ్లికాని ముగ్గురు యువతులు పెళ్లిరోజు కోసం ఎలాంటి కలలు కన్నారు? వాటిని ఎలా సాకారం చేసుకున్నారు? అనే కథతో ఈ సినిమా తీశాం’’ అన్నారు దర్శకుడు నెల్సన్‌ వెంకటేశన్‌. దినేశ్, మియా జార్జ్, రిత్విక, నివేథా పెతురాజ్‌ ప్రధాన పాత్రల్లో ఆయన దర్శకత్వంలో సురేష్‌ బల్లా, మృదుల మంగిశెట్టి నిర్మించిన చిత్రం ‘పెళ్లి రోజు’. ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘మా చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేసేందుకు కృషి చేసిన ప్రవీణ్‌ కుమార్‌కి కృతజ్ఞతలు’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి మాటలు: వెంకట్‌ మల్లూరి, పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర, డా. చల్లా భాగ్యలక్ష్మి, సహనిర్మాత: జె.వినయ్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top