అప్పుడే ఫలితం చెల్లుతుంది: తాప్సీ

Taapsee Pannu Tweets On What Makes The Race Fair - Sakshi

ముంబై: హీరోయిన్‌ తాప్సీ పొన్ను బాలీవుడ్‌లో నెపోటిజం(బంధుప్రీతి) నేపథ్యంలో ‘ఫేర్‌ రేసస్‌’పై ట్వీట్‌ చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య పోలిక ఒకే స్థలం నుంచి ప్రారంభించినప్పుడే చెల్లుతుంది అంటూ తాప్సీ శుక్రవారం ట్వీట్ చేశారు. ‘పోటీ అనేది నిజాయితీగా ఉన్నప్పుడే దాని ఫలితం చెల్లుతుంది. ప్రతి ఆటగాడికి ప్రారంభ స్థానం ఒకేలా ఉంటుంది. కాకపోతే తదుపరి పోటీ లేదా దాడి వల్ల ఆట చివరి గౌరవాన్ని తీసివేస్తుంది. #JustAThought #AppliesToLife’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. (చదవండి: జస్టిస్‌ ఫర్‌ జయరాజ్‌ అండ్‌ బెన్నిక్స్‌)

సుశాంత్‌ మరణం తర్వాత కొందరూ బాలీవుడ్‌ నటీనటులు తాము కూడా నెపోటిజం బాధితులమే అంటూ ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో తాప్సీ కూడా ఒకప్పుడు తాను నెపోటిజం బాధితురాలినే అని వెల్లడించారు. గత నెల జూన్‌ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో నెపోటిజం వల్లే సుశాంత్‌ మరణించాడంటూ బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతలు, స్టార్‌ కిడ్స్‌పై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top