జాన్‌ శ్రీదేవీ..బోనీకపూర్‌ స్పెషల్‌ ట్వీట్‌ | Sridevi, Boney Kapoor wedding anniversary | Sakshi
Sakshi News home page

జాన్‌ శ్రీదేవీ..బోనీకపూర్‌ స్పెషల్‌ ట్వీట్‌

Jun 2 2018 6:22 PM | Updated on Jun 2 2018 6:55 PM

Sridevi, Boney Kapoor wedding anniversary - Sakshi

సాక్షి, ముంబై: అందాలనటి, వెండి తెర జాబిలి   శ్రీదేవి నింగికేగి అపుడే  మూడు నెలలు గడిచిపోయింది.  ఈ రోజు (జూన్‌ 2)  శ్రీదేవీ, బోనీ కపూర్‌ల​  వివాహ వార్షికోత్సవం.  శ్రీదేవి బతికి వుండి వుంటే ఈ వేడుకలను ఉత్సాహంగా జరుపుకునే వారేమో.  ఇదే విషయాన్ని ఆమె భర్త బోనీకపూర్‌  సోషల్‌ మీడియాలో  గుర్తు చేసుకున్నారు.   తన భార్య తనతో లేకపోయినా....ఆమె ప్రేమ,  స్నేహం  ఎప్పటికీ తనతోపాటే నిలిచి వుంటుందంటూ ట్విటర్‌లో తన ఆవేదనను పంచుకున్నారు.  ఈ మేరకు శ్రీదేవి ట్విటర్‌ ఖాతాలో బోనీకపూర్‌ శనివారం ఒక ట్వీట్‌ చేశారు.  దీంతోపాటు ఒక వీడియోను కూడా షేర్‌ చేశారు.

‘నువ్వు ఉండి వుంటే  ఈ రోజు మన 22 వ వివాహ వార్షికోత్సవం అయ్యేది.  నా ప్రాణమా.నా అర్థంగీ, నా ఆత్మ,  ప్రేమకు ప్రతిరూపమా...నీ ప్రేమా  నీ ఉత్సాహం, నీ నవ్వు  ఎప్పటికీ నా తోనే..’ అంటూ ట్వీటర్‌ లో  పేర్కొన్నారు.    కాగా  ప్రముఖ సినీ నటి శ్రీదేవి  ఫిబ్రవరి 25న హఠాన్మరణం చెందడం యావత్తు ప్రపంచాన్ని తీవ్ర విభ్రాంతికి గురిచేసింది.  సమీప బంధువు  పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు కుటుంబసభ్యులతో దుబాయ్‌కు వెళ్లిన ఆమె తీవ్రమైన గుండెపోటుతో  కన్నుమూసినట్టుగా కుటుంబ సభ్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement