వైరలవుతోన్న నటి ఫోటో

Sridevi Birth Anniversary Janhvi Shares Throwback Photo - Sakshi

బాలీవుడ్‌ లేడి సుపర్‌ స్టార్‌ శ్రీదేవికి ఎప్పుడు ఏ విషయానికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలో బాగా తెలుసు. అందుకే తల్లయ్యాక ఆమె సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. మళ్లీ 15 ఏళ్ల తర్వాత 2012లో ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  అనంతరం మరో నాలుగేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఆ సమయంలో ఆమె కూతుళ్లు భవిష్యత్‌ గురించి ప్రణాళికలు రూపొందించారు.

ఈ విషయం గురించి ఆమె ‘చాలా మంది మంచి కథలతో నా దగ్గరకు వస్తున్నారు. కానీ నేనే ఒప్పుకోలేదు. అది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. నా పెద్ద కూతురు జాన్వీ ఉన్నత చదువులు చదువుతోంది. ఇప్పుడు తాను చాలా కొత్త విషయాలను ఎదుర్కోబోతుంది. ఈ సమయంలో ఒక తల్లిగా నేను తనతో ఉండటం చాలా అవసరం. తల్లిగా నా బాధ్యతలు నెరవేర్చడమే నా తొలి కర్తవ్యం’ అన్నారు. ‘మామ్‌’ శ్రీదేవి నటించిన చివరి చిత్రం. శ్రీదేవి తన పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ ప్రవేశం గురించి ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. కానీ ఆ కల నిజమయ్యే సమయానికి ఆమె మన మధ్యలో లేకుండా పోయారు.

ఈ రోజు శ్రీదేవి 55వ పుట్టిన రోజు. గతంలో ఒక సారి శ్రీదేవి ఖుషి కన్నా జాన్వీకే తన అవసరం ఎక్కువ అని చెప్పారు. జాన్వీ కూడా శ్రీదేవి చనిపోయిన తర్వాత తల్లిని తల్చుకుంటూ ‘నేను ఇంత వరకూ ఎవరి మీదా దేని కోసం ఆధారపడలేదు. ఎందుకంటే నాకు కావలసినవన్ని సమకూర్చే ఏకైక వ్యక్తి.. నా ప్రాణ స్నేహితురాలు నువ్వే అమ్మ’ అనే సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ఈ రోజు తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా జాన్వీ శ్రీదేవితో దిగిన అపురూపమైన ఫోటోను షేర్‌ చేశారు. ఈ ఫోటోలో శ్రీదేవి చిన్నారి జాన్వీని ఎత్తుకుని, భర్త బోనీ కపూర్‌తో పాటు ఉన్నారు. ఈ ఫోటో శ్రీదేవి అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా బోనీ కపూర్‌ ‘ఇక్కడ చాలా మంది హీరోలు, లెజండ్‌లు ఉన్నారు. హీరోలను మర్చిపోతాం. కానీ లెజండ్‌లను ఎవరూ ఎన్నటికి మర్చిపోలేరు. శ్రీ ప్రతిరోజు.. ప్రతి క్షణం మాతోనే ఉంది. ఒక్క నిమిషం కూడా మేము తనని మిస్‌ అవ్వడం లేదు’ అంటూ శ్రీదేవిని గుర్తు చేసుకున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top