'ఆ హీరోయిన్ స్టైల్ చాలా ఇష్టం' | Sonakshi is cool and edgy, says Alia Bhatt | Sakshi
Sakshi News home page

'ఆ హీరోయిన్ స్టైల్ చాలా ఇష్టం'

Dec 1 2015 5:59 PM | Updated on Apr 3 2019 6:23 PM

'ఆ హీరోయిన్ స్టైల్ చాలా ఇష్టం' - Sakshi

'ఆ హీరోయిన్ స్టైల్ చాలా ఇష్టం'

సాధారణంగా హీరోయిన్లే కాదు.. మామూలు అమ్మాయిలైనా, తోటి వారిని ఎవరైనా పొగిడితేనే లోలోపల ఏదో ఇబ్బంది ఉన్నట్లుగా ఫీలవడం సహజమే.

ముంబై: సాధారణంగా హీరోయిన్లే కాదు.. మామూలు అమ్మాయిలైనా, తోటి వారిని ఎవరైనా పొగిడితేనే లోలోపల ఏదో ఇబ్బంది ఉన్నట్లుగా ఫీలవడం సహజమే. కానీ, బాలీవుడ్ క్యూట్ గాళ్ ఆలియా భట్ మాత్రం తోటి హీరోయిన్ సోనాక్షి సిన్హాను పొగడ్తలతో ముంచెత్తింది. సోనాక్షి స్టైల్, ప్రయోగాత్మక లక్షణాలంటే తనకు ఇష్టమంటోంది మహేష్ భట్ తనయ. ప్రత్యేకంగా సోనాక్షి ప్రయాణాల విషయంలో ఆమె స్టైల్ తనకు నచ్చుతుందని పేర్కొంది. ఏదో పనిమీద ఇటీవలే శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లిన సోనాక్షీ సూసైడ్ స్పాట్ను సందర్శించిన విషయం విదితమే.

ఎలిక్స్ ఫిల్మ్ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆలియా మీడియాతో ఈ విషయాల్ని పంచుకున్నారు. శరీరానికి సౌకర్యంగా ఉండే దుస్తువులు ఏవైనా ధరించవచ్చన్నారు. హీరోల విషయంలో అయితే.. బిగ్ బీ అమితాబ్ చాలా స్టైలిష్గా ఫర్ఫెక్ట్ గా ఉంటారన్నది. సోనాక్షితో పాటు 'క్వీన్' స్టార్ కంగనా రనౌత్ స్టైల్, ఆమె నటన నచ్చుతుందని చెప్పుకొచ్చింది. ఇతర హీరోయిన్ల విషయం ఏమో గానీ, ఆలియా మాత్రం తన రూటు సపరేటు అని మరోసారి నిరూపించుకుంది. ఈ ముద్దుగుమ్మ గతంలో కత్రినాను కూడా తెగ పొగిడేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement