
నటి శ్రుతి హాసన్ తన పుట్టిన రోజును లండన్‌లో మంగళవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన స్నేహితులతో కలిసి లండన్ రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా జనవరి 28న శ్రుతి బర్త్ డే. తన స్నేహితులతో కలిసి లండన్‌లో బర్త్ డే సెలబ్రేషన్స్‌ను జరుపుకున్నారు. ఈ క్రమంలో రోడ్లపై డాన్స్ చేస్తున్న ఫొటోలను, వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘నా హ్యాపీ బర్త్ డే డాన్స్.. ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. అందుకే ఈ డాన్స్‌లు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. అదేవిధంగా తన పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులకు, సన్నీహితులకు, తన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇక పుట్టినరోజు సందర్భంగా శ్రుతి వెబ్‌సైట్‌ను కూడా మొదలు పెడుతున్నట్లు వెల్లడించారు.
కాగా హాలీవుడ్ యానిమేటెడ్ చిత్రం ఫ్రోజెన్ 2 తమిళ రీమెక్‌కు శ్రుతి హాసన్ డబ్బింగ్ చెప్పడమే కాకుండా ఈ సినిమాలో మూడు పాటలు కూడా పాడారు. ఇప్పటికే ఆమె నటిగా, గాయనిగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, వ్యాఖ్యాతగా తనలోని విభిన్న కోణాలతో అభిమానులను మెప్పించారు. కాగా ప్రస్తుతం శ్రుతి తమిళంలో ‘లాబామ్’, తెలుగులో రాబోయే ఓ కొత్త సినిమాలో నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం తన మ్యుజిక్ కెరీర్‌పై దృష్టి పెట్టిన ఆమె గతంతో లండన్‌లో జరిగిన ఓ మ్యూజిక్ కన్సర్ట్‌లో పాటలు పాడారు.