మరోసారి థ్రిల్లర్ మూవీలో శర్వానంద్..! | Sharwanand to team up with Sudheer Varma | Sakshi
Sakshi News home page

మరోసారి థ్రిల్లర్ మూవీలో శర్వానంద్..!

Aug 28 2017 11:42 AM | Updated on Sep 17 2017 6:03 PM

మరోసారి థ్రిల్లర్ మూవీలో శర్వానంద్..!

మరోసారి థ్రిల్లర్ మూవీలో శర్వానంద్..!

కొత్త కథలతో వరుస విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో శర్వానంద్ మరో డిఫరెంట్ సినిమాకు ఓకె చెప్పాడన్న టాక్ వినిపిస్తోంది.

కొత్త కథలతో వరుస విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో శర్వానంద్ మరో డిఫరెంట్ సినిమాకు ఓకె చెప్పాడన్న టాక్ వినిపిస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువగా సీరియస్, థ్రిల్లర్ సినిమాలు మాత్రమే చేసిన శర్వానంద్, ప్రస్తుతం కామెడీ, ఫ్యామిలీ డ్రామాలతో అలరిస్తున్నాడు. అయితే మరోసారి థ్రిల్లర్ సినిమాకు ఓకె చెప్పాడట ఈ యంగ్ హీరో. స్వామి రారా, కేశల లాంటి సినిమాలతో ఆకట్టుకున్న సుధీర్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. కమల్ హాసన్ నాయకుడు తరహా కథతో ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ వయసైన పాత్రలో కూడా కనిపించనున్నాడట. ప్రస్తుతం సెట్స్  మీద ఉన్న మహానుభావుడు పూర్తయిన తరువాత సుధీర్ వర్మ సినిమా సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement