లాయర్‌కు లవర్‌గా! | Shahid Kapoor to romance Shraddha and not Katrina Kaif in Batti Gul Meter Chalu? | Sakshi
Sakshi News home page

లాయర్‌కు లవర్‌గా!

Jan 3 2018 12:04 AM | Updated on Apr 3 2019 6:34 PM

Shahid Kapoor to romance Shraddha and not Katrina Kaif in Batti Gul Meter Chalu? - Sakshi

లాయర్‌కు లవర్‌ను వెతికే పనిలో పడ్డారు శ్రీ నారాయణ్‌ సింగ్‌ అండ్‌ టీమ్‌. ఇంతకీ... ఈ శ్రీ నారాయణ్‌ సింగ్‌ ఎవరో కాదండి. హిందీలో ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’ వంటి సోషల్‌ మెసేజ్‌ ఉన్న చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు. మరి లాయర్‌ ఎవరంటే షాహిద్‌ కపూర్‌. ఈ లాయర్‌కు నారాయణ్‌ సింగ్‌ ఎందుకు లవర్‌ని వెతుకుతున్నారు? అసలు షాహిద్‌ లాయర్‌ ఏంటి? అని కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారా? మరేం లేదు. షాహిద్‌ హీరోగా నారాయణ్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘బట్టీ గుల్‌ మీటర్‌ చలే’.

సామాన్యులు ఎదుర్కొనే విద్యుత్‌ సమస్యల ఆధారంగా రూపొందుతున్న  ఈ సినిమాలో షాహిద్‌కు ఇంకా జోడీ  సెట్‌ కాలేదు. మొదట కత్రినా కైఫ్‌ను అడిగారట. డైరీలో డైట్స్‌ ఖాళీ లేకపోవ డంతో  ‘సారీ’ అని అనేశారట. దీంతో చిత్రబృందం శ్రద్ధా కపూర్‌ను సంప్రదించారని బాలీవుడ్‌ టాక్‌. ఆల్మోస్ట్‌ శ్రద్ధా కపూర్‌ ఒప్పుకునే చాన్సులే మెండుగా ఉన్నాయని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఆల్రెడీ మూడేళ్ల కిత్రం షాహిద్, శ్రద్ధ ‘హైదర్‌’లో జంటగా నటించారు కాబట్టి ఇద్దరి మధ్య మంచి స్నేహే ఉందనీ, పైగా ‘బట్టీ గుల్‌ మీటర్‌ చలే’ స్టోరీ కూడా బాగుంది కాబట్టి శ్రద్ధ ఒప్పుకుంటారని ఊహిస్తున్నారు. మరి లాయర్‌కు శ్రద్ధా ఓకే చెబుతారా? అంటే.. వెయిట్‌ అండ్‌ సీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement