వన్‌ మిలియన్‌ లైక్స్‌.. నయా రికార్డు..

Samajavaragamana Song Has Received 1 Million Likes on YouTube - Sakshi

‘సామజవరగమన... నిను చూసి ఆగగలనా...’ ఇప్పుడు సోషల్‌ మీడియా నుంచి ఫోన్‌ రింగ్‌ టోన్, కాలర్‌ ట్యూన్స్‌ వరకూ ఎక్కువగా వినిపిస్తున్న పాట ఇది. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో తమన్‌ స్వరపరిచిన ఈ పాట విడుదల అయినప్పటినుంచే బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది.  ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. ఇప్పటికే మిలిమన్‌ నుంచి బిలియన్‌ వ్యూస్‌ దిశగా దూసుకపోతూ సెన్సేషన్‌ సృష్టించబోతోంది ఈ సాంగ్‌. తాజాగా ‘సామజవరగమన’మరో మైలు రాయిని అందుకుంది. యూట్యూబ్‌లో వన్‌ మిలియన్‌ లైక్‌లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. టాలీవుడ్‌లో ఓ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌/టీజర్‌/వీడియో సాంగ్‌కు ఇన్ని లైక్‌లు రావడం ఇదే ప్రథమం కావడం విశేషం

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. లాంగ్ గ్యాప్‌ తరువాత బన్నీ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, టీజర్‌, సాంగ్స్‌ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్‌ చేశాయి. ఇక ఈ సినిమాలోని పాటలు అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ అండ్‌ స్పెషల్‌ సాంగ్స్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ‘సామజవరగమన’ తో పాటు దీపావళి కానుకగా వచ్చిన ‘రాములో రాములా’ సాంగ్‌ కూడా సోషల్‌ మీడియాను ఆగం చేసింది. ఈ రెండు పాటలతో పాటు ‘ఓ మై గాడ్‌ డాడీ’ సాంగ్‌ కూడా శ్రోతలను అలరిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో సుశాంత్, సునీల్, నవదీప్, టబు, మురళీ శర్మ తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top