నాకా శక్తి లేదు : పెళ్లి గురించి సల్మాన్‌ | Salman Khan Reveals Why He Single Till Now | Sakshi
Sakshi News home page

Feb 24 2018 12:16 PM | Updated on Apr 3 2019 6:23 PM

Salman Khan Reveals Why He Single Till Now - Sakshi

సల్మాన్‌ ఖాన్‌ (పాత చిత్రం)

సాక్షి, సినిమా : బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ వివాహ వార్త అక్కడి మీడియాలో ఎప్పుడూ హాట్‌ టాపికే. కెరీర్‌ ప్రారంభం నుంచి పలువురు హీరోయిన్లతో సల్మాన్‌ అఫైర్లు సాగించినప్పటికీ.. పెళ్లి పీటలు ఎక్కకుండా ఆ బంధాలు ముగిసిపోయాయి. 

సంగీత బిజ్లానీ దగ్గరి నుంచి ఐశ్వర్యరాయ్‌, కత్రినా కైఫ్‌.. ఇలా పలువురి పేర్లు వినిపించాయి. గత కొంత కాలంగా రొమేనియన్‌ మోడల్‌ లులియా వాంటర్ తో డేటింగ్‌లో ఉన్నాడన్న వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. దీనిపై ప్రశ్నిస్తే 52 ఏళ్ల సల్లూభాయ్‌ వెటకారపు సమాధానాలు ఇస్తాడే తప్ప స్పష్టత ఇవ్వడు. తాజాగా ముంబైలో ఓ ఈవెంట్‌కు హాజరైన సల్మాన్‌ వద్ద మీడియా వివాహ ప్రస్తావన తీసుకు రాగా.. ఎలాంటి సమాధానం ఇచ్చాడో చూడండి.

‘వివాహం అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నా తండ్రి వివాహానికి 180రూ. ఖర్చు అయ్యింది. కానీ, ఇప్పుడు పెళ్లిళ్లంటేనే లక్షల నుంచి కోట్లతో ముడిపడిన వ్యవహారం. ఓ మంచి అమ్మాయిని వెతకటం దగ్గరి నుంచే ఈ ఖర్చు ప్రారంభమౌతుంది. వివాహానికి... ఆ తర్వాత భార్య కోసం కూడా అదే స్థాయిలో ఖర్చులు చేయాల్సి ఉంటుంది. అదంతా భరించటం నా వల్ల కాదు. నాకా శక్తి లేదు. అందుకే నేను ఇంకా ఒంటరిగానే ఉన్నా’ అని సల్మాన్‌ తెలిపాడు.   

ఫోర్బ్స్‌ లిస్ట్‌ లో అగ్రస్థానంలో ఉన్న ఓ సెలబ్రిటీ‌, పైగా  2014లో సోదరి అర్పిత వివాహాం కోసం కోట్లు కుమ్మరించి దేశంలోనే అత్యంత విలాసవంతమైన ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వేడుకలు నిర్వహించిన సల్మాన్‌ నోట ఇలాంటి మాట రావటం కాస్త కామెడీగా ఉందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

షాక్‌ ఇచ్చిన సల్మాన్‌ గర్ల్‌ ఫ్రెండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement