చలో మస్కట్‌ | sai dharam tej, vv vinayak, c kalyan in maskat for film shooting | Sakshi
Sakshi News home page

చలో మస్కట్‌

Dec 17 2017 1:45 AM | Updated on Dec 17 2017 1:45 AM

sai dharam tej, vv vinayak, c kalyan in maskat for film shooting  - Sakshi

బై బై హైదరాబాద్‌... చలో మస్కట్‌ అంటూ సాయిధరమ్‌ తేజ్‌ ఫ్లైట్‌ ఎక్కేశారు. న్యూ ఇయర్‌ని మస్కట్‌లో జరుపుకుంటారని ఊహిస్తున్నారా? అదేం కాదు. షూటింగ్‌ కోసం వెళ్లారు. వీవీ వినాయక్‌ దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్, లావణ్యా త్రిపాఠి జంటగా సి. కల్యాణ్‌ ఓ చిత్రం నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ ముగించుకుని, మస్కట్‌ ప్రయాణమైంది ఈ బృందం.

‘‘ఈ నెల 18 నుంచి 28 వరకూ మస్కట్‌లో రెండు పాటలు చిత్రీకరించబోతున్నాం. ఓ పాటకు జానీ మాస్టర్, మరో పాటకు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తారు. మస్కట్‌లో సాంగ్స్‌ షూట్‌ పూర్తి చేసి, ఇండియా రాగానే క్లైమాక్స్‌ మొదలుపెడతాం. ఫిబ్రవరి 9న సినిమాని రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ–మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: ఎస్వీ విశ్వేశ్వర్, సంగీతం: థమ¯Œ , ఎడిటింగ్‌: గౌతంరాజు, సహనిర్మాతలు: సి.వి. రావు, నాగరాజ పత్సా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement