నా వోడ్కా నేనే తెచ్చుకుంటా : వర్మ | Ram Gopal Varma on Puri Jagannadh's iSmart Shankar | Sakshi
Sakshi News home page

నా వోడ్కా నేనే తెచ్చుకుంటా : వర్మ

Jul 13 2019 10:03 AM | Updated on Jul 13 2019 4:07 PM

Ram Gopal Varma on Puri Jagannadh's iSmart Shankar - Sakshi

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌, ఎనర్జిటిక్‌ హీరో రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ఇస్మార్ట్ శంకర్‌. పూరి, చార్మిలు నిర్మిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్‌, నిధి అగర్వాల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరు పెంచిన చిత్రయూనిట్ మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్‌ పై స్పందించిన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, పూరి ఈజ్‌ బ్యాక్‌ అంటూ కామెంట్ చేశారు. ‘పూరి జగన్నాథ్‌ మార్క్ మాస్‌ మసాలా టేకింగ్‌, పంచ్‌ డైలాగ్స్‌తో ఇస్మార్ట్ శంకర్‌. రామ్‌ గతంలో చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. నిధి అగర్వాల్‌ సూర్యడి కంటే ఎక్కువ వేడి పుట్టిస్తోంది. చార్మి మేం తొలి రోజు తొలి ఆటకు సిద్ధమవుతున్నాం’ అంటూ ట్వీట్‌ చేశారు.

వర్మ ట్వీట్‌పై స్పందించిన పూరి కృతజ్ఞతలు తెలియజేశారు. చార్మి స్పందిస్తూ ఇస్మార్ట్ శంకర్‌ ఫుల్‌ మీల్స్‌ లాంటి సినిమా అంటూ కామెంట్ చేశారు. వర్మ సమాధానమిస్తూ ‘అయితే పార్టీకి నా వోడ్కా నేనే తెచ్చుకుంటా’ అంటూ రిప్లై ఇచ్చారు. దీనికి బదులుగా చార్మీ.. ‘వోడ్కాతో పాటు ఇస్మార్ట్ శంకర్‌ ఫస్ట్ కాపీ తీసుకొని మీ దగ్గరికి వస్తున్నాను. ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం’ అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement