
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తన సతీమణి ఉపాసనను కొనియాడారు. తన భార్యను చూసి ఎంతో గర్వపడుతున్నాని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. శనివారం ముంబైలో జరిగిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రధానోత్సవంలో ఉపాసనకు అరుదైన గౌరవం దక్కింది. ఫిలాన్‌త్రోకపిస్ట్ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డును అందుకున్నారు.
ఈ విషయాన్ని పేర్కొంటూ.. ‘డియర్ ఉప్సీ నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఫిలాన్‌త్రోపిస్ట్ ఆఫ్ ది ఇయర్‌గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నందుకు కంగ్రాట్స్’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ అవార్డును అందుకున్నందుకు ఉపాసన.. ‘చాలా సంతోషంగా ఉంది. సోషల్‌మీడియాలో నాకు మెసేజ్‌లు చేస్తూ, నన్ను మోటివేట్ చేస్తున్నవారికి ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. నేను చేపట్టిన ప్రతి కార్యక్రమానికి నా వెన్నంటే ఉంటూ మద్దతుగా నిలిచిన నా కుటుంబానికి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌చేశారు.
Yessss
— Upasana Konidela (@upasanakonidela) April 20, 2019
The #dadasahebphalkeaward for
the Philanthropist Of The Year
Really Humbled🙏🏼
I dedicate this to all the positive ppl arnd me who keep messaging me & motivating me to do good everyday.
My dearest family - thanks for always being there to support me🥰 @Dpiff_official pic.twitter.com/L30OHNj8gq