గబ్బర్ సింగ్ 2లో 'ఆమే' హీరోయిన్! | Rakul preet singh in gabbar singh 2 movie | Sakshi
Sakshi News home page

గబ్బర్ సింగ్ 2లో 'ఆమే' హీరోయిన్!

Oct 20 2014 10:47 AM | Updated on Mar 22 2019 5:33 PM

గబ్బర్ సింగ్ 2లో 'ఆమే' హీరోయిన్! - Sakshi

గబ్బర్ సింగ్ 2లో 'ఆమే' హీరోయిన్!

టాలీవుడ్లో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగ రాసిన గబ్బర్ సింగ్ సినిమా సీక్వెల్లో హీరోయిన్ ఖరారు అయినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్లో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగ రాసిన గబ్బర్ సింగ్ సినిమా సీక్వెల్లో హీరోయిన్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న 'గబ్బర్ సింగ్ -2'లో హీరోయిన్ అవకాశం రకుల్ ప్రీత్ సింగ్ను వరించినట్లు సమాచారం. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన రకుల్...అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె నటించిన లౌక్యం కూడా హిట్ కొట్టడంతో రకుల్కు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.  ఈసారి ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

రకుల్ ప్రీత్ సింగ్ నటనకు పవన్ కళ్యాణ్ ఇంప్రెస్ అయినట్లు సమాచారం. దాంతో ఆమెను హీరోయిన్గా తీసుకుంటే బాగుంటుందని దర్శక, నిర్మాతలకు ఆయన సూచించినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్-2 చిత్రం కొద్ది నెలల ముందే లాంఛనంగా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొనటంతో పాటు 'గోపాల గోపాల' చిత్రంతో బిజీగా ఉన్నాడు.

తాజాగా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్-2 రెగ్యులర్ షూటింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. దాంతో దర్శక, నిర్మాతలు హీరోయిన్ కోసం వేట ప్రారంభించారు. పలువురి హీరోయిన్ల పేర్లు తెర మీదకు వచ్చినా...చివరికి రకుల్ ప్రీత్ పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం రకుల్ తెలుగుతో పాటు హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement